Guests To Pay For Meal: ‘నా పెళ్ళిలో భోజనం చేశాక బిల్లు కట్టాలి’.. వధువు పోస్ట్ వైరల్

తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే, వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెట్టే స్తోమత తమకు లేదని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తన పెళ్ళికి గిఫ్టులకు బదులుగా భోజనం తిన్న తర్వాత ఆ ఆహారానికి బిల్లు చెల్లిస్తే చాలని చెప్పింది. అయితే, ఫేస్ బుక్ లో ఆమె చేసిన ఈ పోస్టుకు దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు నెటిజన్లు. ఆ అమ్మాయి చేసిన పోస్టును రెడ్డిట్ గ్రూప్ r/weddingshamingలోనూ పోస్ట్ చేశారు. అతిథులు భోజనం తిన్న తర్వాత అందుకు ఎవరన్నా బిల్లు కట్టాలని అడుగుతారా? అంటూ కొందరు కామెంట్లు చేశారు.

Guests To Pay For Meal: ‘నా పెళ్ళిలో భోజనం చేశాక బిల్లు కట్టాలి’.. వధువు పోస్ట్ వైరల్

Guests To Pay For Meal

Guests To Pay For Meal: భారత్ భోజన ప్రియుల దేశం.. పెళ్ళంటే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది అక్కడ పెట్టే భోజనాలే. ‘పెళ్ళీడుకు వచ్చావు పప్పన్నం ఎప్పుడు పెడతావు?’ అనే అడుగుతుంటాం. పెళ్ళి పందిరిలోకి వెళ్ళి భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? అని అడిగే వారు చాలా మంది ఉంటారు. పెళ్ళిలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు చేసి బంధు, మిత్రులకు కడుపునిండా పెట్టడం మన ఆనవాయితీ. అయితే, వారు భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించండి? అంటే ఎలా ఉంటుంది. తాను ఇలాగే అడుగుతానని అంటోంది ఓ అమ్మాయి.

తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే, వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెట్టే స్తోమత తమకు లేదని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తన పెళ్ళికి గిఫ్టులకు బదులుగా భోజనం తిన్న తర్వాత ఆ ఆహారానికి బిల్లు చెల్లిస్తే చాలని చెప్పింది. అయితే, ఫేస్ బుక్ లో ఆమె చేసిన ఈ పోస్టుకు దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు నెటిజన్లు. ఆ అమ్మాయి చేసిన పోస్టును రెడ్డిట్ గ్రూప్ r/weddingshamingలోనూ పోస్ట్ చేశారు. అతిథులు భోజనం తిన్న తర్వాత అందుకు ఎవరన్నా బిల్లు కట్టాలని అడుగుతారా? అంటూ కొందరు కామెంట్లు చేశారు.

‘అయ్యయ్యో నేను ఓ పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది భోజనం చేశాక బిల్లు అడగరు కదా?’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. హోటల్ లో తిన్న ఆహార పదార్థాలకు బిల్లు కడతాం.. పెళ్ళిలో తిన్నదానికి కూడా కట్టాలని అడిగితే ఎలా? అని కొందరు స్పందించారు. ‘నేను ఆ అమ్మాయికి ఓ పరిష్కార మార్గం చెప్పాలనుకుంటున్నాను. 30 మందినే పెళ్ళికి పిలిచి వారికి ఉచితంగా భోజనం పెట్టండి’ అని ఒకరు పేర్కొన్నారు. మొత్తానికి ఆ అమ్మాయి చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

 Guests To Pay For Meal

Guests To Pay For Meal

Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్