అప్పటి నుంచి నా భార్యను ముద్దు కూడా పెట్టుకోలేదు: మాజీ సీఎం

అప్పటి నుంచి నా భార్యను ముద్దు కూడా పెట్టుకోలేదు: మాజీ సీఎం

Farooq Abdullah: జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్ లో పర్సనల్ విషయాలు చెప్పి అందరిలో నవ్వులు పూయించారు. నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రెసిడెంట్ ఫరూఖ్ అబ్దుల్లా ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని హ్యాండ్ షేక్ లేదా హగ్ ఇచ్చేందుకు కూడా ప్రస్తుత పరిస్థితులు సరైనవి కావని అన్నారు.

‘నేనిప్పుడు వరకూ నా భార్యను ముద్దు కూడా పెట్టుకోలేదు. ఏం తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో. కౌగిలించుకోవడం వల్ల జరిగే నష్టం లేదులే. కానీ, ఏమో’ అని చెప్పగానే మీటింగ్ కు వచ్చిన వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. తన కూతురు మాస్క్ లేకుండా ఉన్న ఫొటో చూసి వెంటనే ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్పిందట.

అయితే ఈ వీడియోలోని చిన్న క్లిప్ మాత్రం నెట్టింటల్లో వైరల్ అయిపోయింది. రోజూ కొవిడ్ వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడే దీని నుంచి బయటపడగలం. ఆదివారం నాటికి కోటి 5లక్షల 57వేల 985మందికి కరోనా ఇన్ఫెక్షన్ రాగా వారిలో లక్షా 52వేల 274మంది చనిపోయారు.

ఇక ఆ బుక్ లాంచింగ్ కు వచ్చిన ఫరూఖ్.. గుజ్రార్ కమ్యూనిటీకి చెందిన సర్ సయ్యద్ అనే వ్యక్తి గురించి మాట్లాడారు. ఆయనపై రాసిన పుస్తకంలో విషయాలను ప్రస్తావించారు. సామాజికంగా, విద్యాపరంగా ఎందరినో మేల్కొలిపారని కొనియాడారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉండి గుజ్రార్ కమ్యూనిటీకి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు.