సినిమా హాళ్లకు 100శాతం కెపాసిటీతో అనుమతి

సినిమా హాళ్లకు 100శాతం కెపాసిటీతో అనుమతి

Cinema Halls: మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ శనివారం కొత్త అనుమతులు ఇచ్చింది. ఫిబ్రవరి 1నుంచి 100శాతం కెపాసిటీతో థియేటర్లలోకి వెళ్లొచ్చని చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా థియేటర్లు, సినిమా హాళ్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్.

వాటిలో కొన్ని గైడ్‌లైన్స్ ఇలా:
* కనీసం 6అడుగుల దూరం పాటించాలని.. ఆడిటోరియంలు, కామన్ ఏరియాల్లో, వెయిటింగ్ ఏరియాల్లో తప్పకుండా పాటించాలని ఆంక్షలు విధించారు.
* ఫేస్ కవర్స్/మాస్క్ లు అన్ని వేళలా తప్పనిసరిగా పాటించాలి.
* హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉండాలి. టచ్ ఫ్రీ మోడ్ లో ఉండేలా చూసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్ లలో, కామన్ ప్రదేశాలలో అలాగే వెళ్లాలి.
* శ్వాస సంబంధిత సమస్యలున్నవారు తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రతి ఒక్కరూ దగ్గేముందు.. తుమ్మే ముందు నోరు, ముక్కుతప్పనిసరిగా మూసుకుని ఉండాలి. టిష్యూ లేదా హ్యాండ్ ఖర్చీఫ్/ మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
* హెల్త్ గురించి సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవడంతో పాటు.. ఏదైనా అనారోగ్యంగా ఉంటే రిపోర్ట్ చేయడం మర్చిపోకండి.
* ఉమ్మడాన్ని కచ్చితంగా నిషేదించేశారు.
* ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఇన్ స్టాల్ చేసుకుని వాడాలని సలహాలిస్తున్నారు.