#Sankranti2023: మోదీ, యోగి, రామ్‌దేవ్ బాబా ఫొటోలతో రంగురంగుల పతంగులు

గుజరాత్ లోని వడోదరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు రాందేవ్ బాబా సహా పలువురు ప్రముఖుల చిత్రాలతో పతంగులు కనపడుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి నాగ సాధువులు, ఇతర భక్తులు కోల్ కతాలోని బాబు ఘాట్ కు గంగాసాగర్ మేళలో పాల్గొనడానికి చేరుకున్నారు. అక్కడ పుణ్యస్నానమాచరిస్తారు.

#Sankranti2023: మోదీ, యోగి, రామ్‌దేవ్ బాబా ఫొటోలతో రంగురంగుల పతంగులు

#Sankranti2023

#Sankranti2023: దేశంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. ఈ పతంగుల పండుగను దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు అంబరాన్నంటే ఆనందంతో జరుపుకుంటున్నారు. మార్కెట్లో రకరకాల పతంగులు కనపడుతున్నాయి. గుజరాత్ లోని వడోదరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు రాందేవ్ బాబా సహా పలువురు ప్రముఖుల చిత్రాలతో పతంగులు కనపడుతున్నాయి.

రంగురంగుల గాలిపటాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. గాలిపటాలు అమ్మే దుకాణాల ముందు ప్రజలు బారులు తీరారు. గుజరాత్ లో సంక్రాంతిని జనవరి 14న ఉత్తరాయణ్ గా జరుపుకుంటారు. మరోవైపు, మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గంగా నదిలో భక్తులు పుణ్యస్నానమాచరించారు. మకర సంక్రాంతిని కిడిచీ పర్వ్ గా ఆ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని ప్రజలు పలు పేర్లతో జరుపుకుంటారు. ఉత్తరాఖండ్ లో ఘుఘుటీ, కాలే కౌవగా ప్రజలు పండుగను జరుపుకుంటారు. హరియాణాలో సక్రాత్ గా ఈ పండుగను చేసుకుంటారు. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి నాగ సాధువులు, ఇతర భక్తులు కోల్ కతాలోని బాబు ఘాట్ కు గంగాసాగర్ మేళలో పాల్గొనడానికి చేరుకున్నారు. అక్కడ పుణ్యస్నానమాచరిస్తారు.

Bhogi Festival : తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి.. తెల్లవారుజాము నుంచే చలి మంటలు