Bharat jodo yatra In tamilnadu: కాసేపట్లో కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళలో ఈ నెల 10 నుంచి ప్రారంభమైంది. కేరళలో 7 జిల్లాల్లో 440 కిలోమీటర్లు సాగింది. కాళ్లకు బొబ్బలు వస్తున్నప్పటికీ రాహుల్‌ గాంధీ తన యాత్రను కొనసాగిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన రైతులతోనూ ఆయన మాట్లాడుతున్నారు.

Bharat jodo yatra In tamilnadu: కాసేపట్లో కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర

Bharat jodo yatra In tamil nadu: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళలో ఈ నెల 10 నుంచి ప్రారంభమైంది. కేరళలో 7 జిల్లాల్లో 440 కిలోమీటర్లు సాగింది. కాళ్లకు బొబ్బలు వస్తున్నప్పటికీ రాహుల్‌ గాంధీ తన యాత్రను కొనసాగిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన రైతులతోనూ ఆయన మాట్లాడుతున్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పాదయాత్ర చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో 3,570 కిలో మీటర్ల మేర 150 రోజులు కొనసాగనుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ తెల్లటి దుస్తులు ధరించి పాల్గొంటున్నారు.

ప్రతిరోజూ 22 నుంచి 23 కిలోమీటర్లు పాల్గొంటారు. రాహుల్ రాత్రి సమయంలో రాహుల్ కంటైనర్లలో బస చేస్తున్నారు. భారత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆయన మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చి కేరళ నుంచి ఢిల్లీ వెళ్లి, వచ్చిన విషయం తెలిసిందే.

Chinese nationals attacked: పాకిస్థాన్‌లో చైనీయులపై కొనసాగుతున్న దాడులు.. మరోసారి కాల్పులు.. ఒకరి మృతి