Nationwide protest: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లు.. ప‌లు ప్రాంతాల్లో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

దేశ వ్యాప్తంగా నేడు ఆందోళ‌న‌లు తెల‌పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధ‌ర‌లపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనుంది. కాసేపట్లో పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో ఈ ర్యాలీ జ‌ర‌గ‌నుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు.

Nationwide protest: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లు.. ప‌లు ప్రాంతాల్లో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

Congress

Nationwide protest: దేశ వ్యాప్తంగా నేడు ఆందోళ‌న‌లు తెల‌పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధ‌ర‌లపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనుంది. కాసేపట్లో పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో ఈ ర్యాలీ జ‌ర‌గ‌నుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ‌ల‌కు ప‌ట్టుబ‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇటీవ‌లే పార్ల‌మెంటులో దీనిపై స్వ‌ల్ప చ‌ర్చ జ‌రిగింది.

కాంగ్రెస్ ఆందోళ‌న‌లకు దిగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీలోని అక్బ‌ర్ రోడ్డ వ‌ద్ద‌ ఆ పార్టీ కార్యాలయానికి స‌మీపంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అక్క‌డికి రాకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జంత‌ర్ మంత‌ర్ మిన‌హా న్యూఢిల్లీ జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు. ప‌లు రాష్ట్రాల్లోనూ పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుదలపై ఆందోళనలు నిర్వహించే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయా నేతలకు అప్పగించి, ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్