Corona cases: బీ కేర్ ఫుల్.. కరోనా కేసులు పెరిగాయి..!

కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషంగా ఉన్న జనాలను.. వైరస్ మళ్లీ భయపెడుతోంది. ఒకే రోజు తేడాలో 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

Corona cases: బీ కేర్ ఫుల్.. కరోనా కేసులు పెరిగాయి..!

Corona Cases 11zon

కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషంగా ఉన్న జనాలను.. వైరస్ మళ్లీ భయపెడుతోంది. ఒకే రోజు తేడాలో 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం.. వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. నిన్న 14, 623 కేసులు నమోదైతే.. తాజా బులెటిన్ ప్రకారం 18 వేల 454 పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజా మరణాలు 160గా నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య 17 వేల 561 గా రికార్డ్ అయ్యింది. బుధవారం మాత్రం 19 వేల 446 మంది కోలుకున్నారు. ఈ లెక్కన.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసులు పెరగడమే కాక.. రికవరీల సంఖ్య తగ్గడం.. గమనించాల్సిన విషయమే.

మరోవైపు.. ఓవరాల్ గా రికవరీ రేటు 98.15 శాతానికి చేరిందని… 2020 మార్చి తర్వాత రికవరీ కేసుల శాతం పెరగడం ఇదే అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కానీ.. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు చేరువగా రావడం.. జనాల్ని ఆందోళనకు గురి చేస్తోంది. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని.. మాస్క్ విధిగా ధరించాల్సిన తప్పనిసరి పరిస్థితిని.. పెరుగుతున్న కేసులు గుర్తు చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నా సరే.. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే.. తప్పదు భారీ మూల్యం అన్న నిపుణుల హెచ్చరికలు గుర్తు చేస్తున్నాయి.