Corona Cases: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు.. జోరుగా వ్యాక్సినేషన్

దేశంలో కరోనా కేసుల సంఖ్య.. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. తాజా లెక్కల ప్రకారం.. దేశంలో 21 వేల 257 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 271 మంది వైరస్ ప్రభావంతో మరణించారు.

10TV Telugu News

దేశంలో కరోనా కేసుల సంఖ్య.. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. తాజా లెక్కల ప్రకారం.. దేశంలో 21 వేల 257 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 271 మంది వైరస్ ప్రభావంతో మరణించారు. ఇదే సమయంలో.. 24 వేల 964 మంది కోలుకున్నారు.

97.96 శాతానికి రికవరీ రేటు

ఓవరాల్ గా చూస్తే.. ఇప్పటివరకూ దేశంలో 3 కోట్ల 39 లక్షల 15 వేల 569 మందికి కరోనా సోకింది. 3 కోట్ల 32 లక్షల 25 వేల 221 మంది కోలుకున్నారు. 4 లక్షల 50 వేల 127 మంది కన్నుమూశారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.96 శాతంగా నమోదైంది. పాజిటివ్ కేసుల శాతం 0.71గా ఉంది.

58 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

కరోనా వ్యాప్తిని గుర్తించి అరికట్టే దిశగా.. కేంద్రం నిత్యం నిర్థరణ పరీక్షలు కొనసాగిస్తోంది. అర్హులకు వ్యాక్సినేషన్ చేయిస్తోంది. ఈ క్రమంలో.. దేశ వ్యాప్తంగా కరోనా నిర్థరణ పరీక్షలు 58 కోట్లు దాటాయి. ఇప్పటివరకూ.. 58 కోట్ల 43 వేల 190 నమూనాలు పరీక్షించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా 1334 ప్రభుత్వ.. 1649 ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించింది.

93 కోట్లు దాటిన వ్యాక్సిన్ల పంపిణీ

వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. 266 రోజులుగా దేశంలో కరోనా టీకాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకూ.. 93 కోట్ల 17 లక్షల 17 వేల 191 టీకాలు పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది. నిన్న గురువారం ఒక్కరోజే.. 50 లక్షల 17 వేల 753 డోసుల టీకాలు అందించినట్టు వివరించింది.