COVID 19: దేశంలో కొత్తగా 9,436 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు 86,591

దేశంలో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 86,591 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

COVID 19: దేశంలో కొత్తగా 9,436 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు 86,591

COVID 19

COVID 19: దేశంలో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 86,591 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,93,787కి చేరిందని వివరించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.93 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.70 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 88.50 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. నిన్న 3,22,551 కరోనా పరీక్షలు చేసిననట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 211.66 కోట్లుగా ఉందని పేర్కొంది.

వాటిలో రెండో డోసులు 94.18 కోట్లు, బూస్టర్ డోసులు15.20 కోట్లుగా ఉన్నాయని చెప్పింది. నిన్న 26,53,964 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో నిన్న కూడా 10 వేల కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?