COVID 19: దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు.. నిన్న 13,15,536 వ్యాక్సిన్ డోసుల వినియోగం

దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,900 మంది కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,01,166 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.21 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.87 శాతంగా ఉందని వివరించింది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉందని పేర్కొంది.

COVID 19: దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు.. నిన్న 13,15,536 వ్యాక్సిన్ డోసుల వినియోగం

COVID 19

COVID 19: దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,900 మంది కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,01,166 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.21 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.87 శాతంగా ఉందని వివరించింది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉందని పేర్కొంది.

ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,36,99,435కు చేరింది. నిన్న 3,15,231 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 88.21 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. నిన్న దేశంలో 13,15,536 కరోనా వ్యాక్సిన్ డోసులను వినియోగించారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 209.40 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. వాటిలో రెండవ డోసుల సంఖ్య 93.91 కోట్లు, బూస్టర్ డోసుల సంఖ్య 13.30 కోట్లుగా ఉందని చెప్పింది. ఢిల్లీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

China-taiwan conflict: తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలు