COVID 19: దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు.. 22,40,162 డోసుల కరోనా వ్యాక్సిన్ల వినియోగం

దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరో్గ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 9,685 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 59,210 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.51 శాతం ఉన్నట్లు తెలిపింది.

COVID 19: దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు.. 22,40,162 డోసుల కరోనా వ్యాక్సిన్ల వినియోగం

COVID-19

COVID 19: దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరో్గ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 9,685 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 59,210 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.51 శాతం ఉన్నట్లు తెలిపింది.

యాక్టివ్ కేసులు 0.13 శాతంగా ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.68 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,38,55,365కు చేరినట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.64 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

నిన్న దేశంలో 3,18,642 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 212.75 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వాడినట్లు చెప్పింది. వాటిలో 94.29 కోట్ల రెండో డోసులు, 16.15 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 22,40,162 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది.

India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్