COVID-19: దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు.. నిన్న 19,35,814 డోసుల వ్యాక్సిన్ల వినియోగం

 దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతం ఉన్నట్లు పేర్కొంది.

COVID-19: దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు.. నిన్న 19,35,814 డోసుల వ్యాక్సిన్ల వినియోగం

COVID-19

COVID-19: దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతం ఉన్నట్లు పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,38,73,430గా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 88.71 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న ఒక్కరోజులో 3,20,820 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 213.20 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. వాటిలో రెండో డోసులు 94.33 కోట్లు, మూడవ డోసులు 16.54 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 19,35,814 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన