కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నపుంసకుల్ని చేసేస్తుంది: స్టడీ

కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నపుంసకుల్ని చేసేస్తుంది: స్టడీ

COVID-19: కరోనావైరస్ సోకిన పురుషుల్లో క్రమంగా నపుంసకత్వానికి దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పురుషుల్లో కరోనా సోకిన తర్వాత అధిక జ్వరంతో పాటు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కోంటున్నారని నిపుణులు ఇటీవలి అధ్యయనంలో హెచ్చరించారు. కోవిడ్ జ్వరం.. నిరంతర దగ్గు, రుచి లేదా వాసన కోల్పోవడం వంటివి కోవిడ్ మూడు ప్రధాన లక్షణాలుగా అందరికి తెలిసిందే. అధిక జ్వరం సాధారణంగా 38C లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

పేషెంట్లు అందరిలో ఒకే ఫలితాలు ఉండకపోవచ్చు కానీ, కొవిడ్-19 వల్ల ఆర్కిటైస్ తో బాధపడుతూ ఫెర్టిలిటీ సమస్యలకు దారితీయొచ్చు. వైరస్ వల్ల వచ్చే జ్వరం కారణంగా వృషణంలో జరిగే ప్రక్రియ మందకొడిగా మారే ప్రమాదం ఉంది. రెండు స్టడీల్లో 50శాతం, 92శాతం అటాప్సీకి గురైన పేషెంట్లు ఆర్కిటైస్ హాల్ మార్క్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో స్టడీలో మాత్రం కేవలం 20శాతం మాత్రమే అటాప్సీకి గురయ్యారు.

అస్సాం యూనివర్శిటీ అధ్యయనంలో కోవిడ్-19 గణనీయమైన సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుందనే ఆధారాలను సైంటిస్టులు వెల్లడించారు. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రపంచ ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పురుషులు మహిళల కంటే SARS-CoV-2 వ్యాధికి అధికంగా గురవుతారని గత అధ్యయనాల్లో వెల్లడైంది. పురుష సంతానోత్పత్తిపై కోవిడ్-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వ్యాప్తితో అధిక జ్వరం కారణంగా ఆర్కిటిస్ అభివృద్ధి చెందుతుంది. తద్వారా వృషణం పనిచేయకపోవచ్చు. కానీ, ఎలుకలకు ఇచ్చినప్పుడు స్పెర్మ్ అసాధారణతలకు కారణమవుతుందని కనుగొన్నారు. కరోనా నుంచి కోలుకున్న పురుషుల్లో ఇప్పటికీ వారి వీర్యంలో కోవిడ్-19ను కలిగి ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు.