Kejriwal on Corona cases: ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి: కేజ్రీవాల్

ఢిల్లీలో రోజువారీ క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ''క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విష‌యంపై మేము దృష్టిసారించాం. కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కేసుల్లో అధిక శాతం తక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి. కరోనా కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు'' అని కేజ్రీవాల్ చెప్పారు.

Kejriwal on Corona cases: ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి: కేజ్రీవాల్
ad

Kejriwal on Corona cases: ఢిల్లీలో రోజువారీ క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ”క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విష‌యంపై మేము దృష్టిసారించాం. కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కేసుల్లో అధిక శాతం తక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి. కరోనా కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు” అని కేజ్రీవాల్ చెప్పారు.

కాగా, ఢిల్లీలో ఆదివారం 2,423 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివిటీ రేటు 14.97 శాతంగా ఉంది. ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసులు 7,484గా ఉన్నాయి. మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 12,751 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.50 శాతంగా ఉంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.69 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,35,16,071గా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 87.85 కోట్ల కరోనా పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 3,63,855 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 206.88 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Hyderabad Traffic Cop: నెంబర్ ప్లేట్ మోసం చేస్తే క్రిమినల్ కేసులే