COVID 19: దేశంలో కొత్తగా 15,754 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు 1,01,830

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మొన్న దేశంలో 12,608 కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 15,754 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనాకు 1,01,830 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉంది. కరోనా వల్ల ఇప్పటివరకు దేశంలో 5,27,253 మంది ప్రాణాలు కోల్పోయారు.

COVID 19: దేశంలో కొత్తగా 15,754 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు 1,01,830

COVID 19

COVID 19: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మొన్న దేశంలో 12,608 కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 15,754 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనాకు 1,01,830 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉంది. కరోనా వల్ల ఇప్పటివరకు దేశంలో 5,27,253 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 3.90 శాతంగా ఉంది.

ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,36,85,535 మంది కోలుకున్నారు. దేశంలో నిన్న 31,52,882 డోసుల కరోనా వ్యాక్సిన్లు వాడారు. దీంతో ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 209.27 కోట్లకు చేరుకుంది. వాటిలో రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 93.90 కోట్లుగా ఉండగా, బూస్టర్ డోసు తీసుకున్న వారి సంఖ్య 13.18 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 88.18 కోట్ల కరోనా పరీక్షలు చేశారు. నిన్న 4,54,491 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్