Crime News: యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేసిన కార్మికులు

Crime News: యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేసిన కార్మికులు

Crime News

Crime News: ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేశారు ఓ మిల్ లో పని చేసే కార్మికులు. ఆ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని కార్మికులు అనుమానించడమే ఇందుకు కారణం. తమిళనాడులోని తిరుచ్చి-మధురై హైవేలోని మణిగండం అనే గ్రామంలోని మిల్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ మిల్లులో పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తారు.

ఆ మిల్లులో నైజీరియా, మాయన్మార్ నుంచి అధిక నాణ్యత ఉండే చెక్కలను దిగుమతి చేసుకుంటారు. ఫర్నిచర్ తయారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ మిల్లులోకి ఓ యువకుడు అక్రమంగా చొరబడ్డాడు. దీంతో అతడిని పట్టుకున్న మిల్లులోని కార్మికులు అక్కడి ఓ చెట్టుకి తాడుతో కట్టేశారు. ఆ యువకుడు చోరీ చేయడానికి వచ్చాడంటూ తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

Bangladesh vs India: ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచిన బంగ్లాదేశ్

పోలీసులు వచ్చి చూసేసరికి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు మిల్లులో చోరీ చేయడానికి వచ్చాడని తమకు ఫిర్యాదు అందడంతో వచ్చామని పోలీసులు చెప్పారు. బాధితుడు తువాకుడీకి చెందిన చక్రవర్తిగా పోలీసులు గుర్తించారు. అతడి మెడ, కుడి చేయి, కుడి మెకాళ్లు, జననాంగాలపై తీవ్ర గాయాలు కనపడ్డాయని చెప్పారు. అసోంకు చెందిన ఫైజల్ , మఫ్జుల్ హూక్ తో పాటు మిల్ యజమానిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..