పెన్షనర్లే టార్గెట్.. అకౌంట్లో పడగానే లక్షల్లో లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

పెన్షనర్లే టార్గెట్.. అకౌంట్లో పడగానే లక్షల్లో లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

digital-india-under-attacka

Cyber Crook: ఉత్తరప్రదేశ్ లోని సైబర్ నేరగాళ్లు.. పెన్షనర్లనే టార్గెట్ చేసుకున్నారు. ఘాజియాబాద్, మీరట్ జిల్లాల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.30లక్షల వరకూ వసూలు చేశారు. కంప్లైంట్ ఆధారంగా.. మీరట్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ఒక కేసులో డబ్బులు బీహార్ నుంచి డ్రా చేసినట్లు తెలిసింది. ఇందులో బ్యాంకు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ అయింది.. లాంటి కాన్ఫిడెన్షియల్ డేటాను బ్యాంక్ స్టాఫ్ నుంచి లీక్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రిటైర్మెంట్ సమయానికి పెన్షనర్ అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బులు పడతాయిని.. మీరట్ ఎస్పీ(క్రైమ్) రామ్ అర్జ్ అంటున్నారు.

ఆన్ లైన్ చీటింగ్ జరిగిందంటూ.. దాదాపు నెలకు 300కంప్లైంట్లు వస్తున్నాయని సైబర్ క్రైమ్ సెల్ అధికారులు అంటున్నారు. బాధితులు 35శాతం డబ్బు మాత్రమే తిరిగి పొందగలుగుతున్నట్లు వెల్లడించారు.

నిందితులు మోసపూరితమైన ఫోన్ కాల్స్ చేసి.. ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి చేసినట్లు నమ్మించి.. పెన్షన్ అకౌంట్ ఓపెన్ చేయమంటారు. ఇలాగే రేడియో సబ్ ఇన్ స్పెక్టర్.. నేపాల్ సింగ్ డిసెంబర్ 2020లో రిటైర్ అయ్యారు. అతని నుంచి ఆరు అంకెల ఓటీపీ సేకరించి రూ.11లక్షలు దోచేశారు. మరో ఘటనలో ఘాజియాబాద్ కు చెందిన వ్యక్తి నుంచి రూ.13లక్షలు లూటీ చేశారు.