గుడిలో ప్రవేశించకూడదంటూ దళిత జంటకు రూ.2.5లక్షల జరిమానా!

గుడిలో ప్రవేశించకూడదంటూ దళిత జంటకు రూ.2.5లక్షల జరిమానా!

Dalit couple: ఓ దళిత జంటకు జరిగిన అవమానం ఇది. ఇంటర్ క్యాస్ట్ చేసుకోవడంతో గుళ్లోకి రానివ్వకపోవడంతో పాటు జరిమానా కూడా విధించారు. తమిళనాడులోని తిరుపతూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీకి చెందిన 26సంవత్సరాల కనగరాజ్, 23సంవత్సరాల జయప్రియల ప్రేమ వివాహం జనవరి 2018లో జరిగింది.

ప్రేమ వ్యవహారం తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. చెన్నైలో ఉంటున్న ఆ జంట కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో కనగరాజ్ సొంతూరికి తిరిగి వచ్చేసింది. రెండేళ్ల తర్వాత ఊరికివచ్చినప్పటికీ ఖాప్ పంచాయితీ పెట్టి రూ.2.5లక్షల ఫైన్ కట్టమన్నారు.

ఇతర కులం వ్యక్తులను పెళ్లి చేసుకుంటే జరిమాని విధించడం మా గ్రామంలో సాధారణమే. కాకపోతే జరిమానా మొత్తం రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ మాత్రమే ఉండేది. కానీ, 2.5లక్షలకు చేరింది. రూ.25వేల వరకూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నా. అంతపెద్ద మొత్తంలో కట్టడమంటే నా వల్ల కానిపని. ఇప్పుడు నేనెలాంటి ఫైన్ కట్టడానికి రెడీగా లేను. అలా పంచాయితీకి ఎదురు తిరిగినందుకు గ్రామోత్సవానికి హాజరవ్వాలని గుళ్లోకి వెళ్లబోతుండగా మమ్మల్ని అడ్డుకున్నారు.

దీనిపై కనగరాజ్ తిమమ్‌పెట్టై పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఖాప్ పంచాయత్ ఎల్లప్పన్, నగేశ్ పెనాల్టీ ఎత్తేసినట్లు చెప్పారు. విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఆ జంట కచ్చితంగా జరిమానా కట్టాల్సిందేనని మళ్లీ మొదలుపెట్టారు.

తిరుపత్తూర్ జిల్లా సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ మాట్లాడుతూ.. ఫైన్ గురించి ఎటువంటి కేసు పెండింగ్ లో లేదు. ఇరు గ్రూపుల మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగలేదు. గుడి ఊరేగింపులో జరిగిన గొడవల కారణంగా రెండు నెలల క్రితం ఇరువర్గాలపై కేసులు ఫైల్ చేశాం. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఫైన్ వేశాం అని పోలీస్ అధికారి అన్నారు.