రైతన్నలకు అండగా మేము సైతం అంటోన్న మహిళా రైతులు

రైతన్నలకు అండగా మేము సైతం అంటోన్న మహిళా రైతులు

Delhi Farmers: రైతు ఆందోళనలో మేము సైతం అంటూ మహిళా రైతులు కాలు కదిపారు. సోమవారం సింఘూ బోర్డర్ వద్ద లీడ్ తీసుకుని ఆందోళనలో పాల్గొంటున్నారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఉదయం నాటికి బోర్డర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్ లోని అమృత్‌సర్, మొహాలీ, ఖన్నా ప్రాంతాల నుంచి చేరుకున్న పలువురు మహిళలు.. రైతులకు సపోర్టింగ్ గా నిలిచారు.

ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ ఓ స్కిట్ రూపంలో ప్రదర్శించారు. రోజంతా మహిళల స్పీచ్ మాత్రమే నడిచింది. అందులో కేవలం ఆందోళనలలో తమ పాత్ర గురించి వివరించారు. సుప్రీం కోర్టు ఇన్నాళ్లు మహిళలు, చిన్నారులు బోర్డర్ వద్ద ఆందోళన చేయడం లేదని భావించగా.. సోమవారం జరిగిన ఈవెంట్ అభిప్రాయాన్ని మార్చేలా చేసింది.

ఆందోళనలో మేం చాలా కీలకంగా ఉన్నాం. వెనక్కు వెళ్లేదే లేదు. ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని భగత్ సింగ్ నేల నుంచి వచ్చాం. మేం కూడా వ్యవసాయానికి సాయం చేస్తాం. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచే వచ్చా. కష్టకాలంలో సపోర్ట్ చేస్తూ వాటిల్లో తోడుంటాం. నిర్ణయం మార్చుకునేంత వరకూ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం’ అని ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ హరీందర్ బిందూ అన్నారు.

సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకారం.. దేశ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరిగింది. మధ్య ప్రదేశ్‌లోని బర్వానీ, ఖార్గోన్ మహిళా రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలోని మహిళా రైతులు ఎద్దుల బండెక్కి ర్యాలీ చేయగా.. రాజస్థాన్ లో ట్రాక్టర్ లు నడిపి ర్యాలీ చేశారు.

హర్యానాలోని మహేంద్రఘడ్ జిల్లాలో, యూపీలోని జాన్పూర్ లో పెద్ద ఎత్తున మీటింగ్ లు నిర్వహించారు. పూనెలో మహిళా కిసాన్ పరిషత్, కోల్‌కతాలో మహిళా కిసాన్ సంసద్ మీటింగ్ లు నిర్వహించారు.