ప్రధాని మోడీకే డిగ్గీరాజా రూ.లక్షా 11వేల విరాళం..!!

ప్రధాని మోడీకే డిగ్గీరాజా రూ.లక్షా 11వేల విరాళం..!!

lord-srirama-mandir

Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ వెల్లడించారు. దాంతో పాటుగా టెంపుల్ ట్రస్ట్‌లో సనాతన ధర్మానికి సంబంధించిన శంకరాచార్య మెయిన్‌ను కలపకపోవడంపై ప్రశ్నించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం. కానీ, నా అభ్యంతరం ఏమిటంటే అందులో సనాతన ధర్మానికి చెందిన శంకరాచార్య మెయిన్ ను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు.

‘నాకు ఎక్కడ మనీ ఎక్కడ డొనేట్ చేయాలో అనేది తెలియలేదు. అందుకే పీఎం మోడీకే రూ.లక్షా 11వేల 111చెక్కును పంపిస్తున్నా. పీఎం మోడీ సరైన అకౌంట్ కే పంపిస్తారనే అనుకుంటున్నా’ అని రాసుకొచ్చారు.

ఇంకా అదే లెటర్ లో విశ్వ హిందూ పరిషత్ రామ మందిర నిర్మాణం కోసం 44రోజుల పాటు విరాళాలు అడిగింది. కొందరు గుర్తు తెలియన వ్యక్తులు కూడా ఈ శ్రమలో పాలుపంచుకున్నారు. కొందరు కర్రలు, కత్తులతోనూ విరాళాలు సేకరించారు. గతంలోనూ విశ్వ హిందూ పరిషత్ విరాళాలు తీసుకుంది. వారి అకౌంట్లను ఓపెన్ గా కనిపించేలా చూడాలని ప్రధానిని అడిగారు దిగ్విజయ్.

కొన్ని వివాదాస్పద నినాదాలు.. ప్రత్యేకించి ఒక కమ్యూనిటీనే టార్గెట్ చేసి చేయడం, మధ్యప్రదేశ్ లో విరాళాల కోసం ర్యాలీ చేయడం అన్నీ మతానికి సంబంధించిన పనేనా అంటూ ప్రశ్నించారు.