Bihar CM: సీఎం నితీశ్ యాత్ర కోసం 15 నిమిషాల పాటు రైళ్లను ఆపిన వైనం.. బీజేపీ విమర్శలు

 బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లాల్సి ఉండడంతో ఆయనకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దారి ఇవ్వడానికి అధికారులు 15 నిమిషాల పాటు లోకల్ ట్రైన్లను ఆపేశారు. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర కొనసాగిస్తున్నారు. నిన్న ఆయన యాత్ర బక్సర్ కు చేరుకుంది. పోలీస్ లైన్స్ నుంచి బక్సర్ లోని అతిథి గృహానికి నితీశ్ వెళ్తున్నారు.

Bihar CM: సీఎం నితీశ్ యాత్ర కోసం 15 నిమిషాల పాటు రైళ్లను ఆపిన వైనం.. బీజేపీ విమర్శలు

Be careful from those two parties says Nitish to Muslims

Bihar CM: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లాల్సి ఉండడంతో ఆయనకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దారి ఇవ్వడానికి అధికారులు 15 నిమిషాల పాటు లోకల్ ట్రైన్లను ఆపేశారు. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర కొనసాగిస్తున్నారు. నిన్న ఆయన యాత్ర బక్సర్ కు చేరుకుంది. పోలీస్ లైన్స్ నుంచి బక్సర్ లోని అతిథి గృహానికి నితీశ్ వెళ్తున్నారు.

అందుకు రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లాలి. దీంతో పట్నా-బక్సర్ లోకల్ ట్రైన్ తో పాటు, కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేశారు. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు అందరూ అసౌకర్యానికి గురయ్యారు. రెండు ప్యాసింజర్ ట్రైన్లను బక్సర్ స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద ఆపేశారు.

రైళ్లు ఎంతకీ ముందుకు కదలకపోవడంతో కొందరు ప్రయాణికులు విసుగెత్తిపోయి, రైళ్లు దిగారు. తదుపరి స్టేషన్లో దిగాల్సిన ప్రయాణికులు అక్కడే దిగి, నడుచుకుంటూ తమ గమ్యస్థానాలకు వెళ్లారు. దీంతో, నితీశ్ కుమార్ పై కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ చౌబే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

నితీశ్ కుమార్ చేస్తున్నది సమాధాన్ యాత్ర కాదని, ‘అంతరాయం కలిగించే యాత్ర’ అని విమర్శలు గుప్పించారు. కాగా, తన సమాధాన్ యాత్రలో భాగంగా నితీశ్ కుమార్ ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

World Oldest Woman Death: ప్రపంచంలో అత్యంత వృద్ధురాలి మృతి.. ఆమె వయస్సు ఎంతంటే?