గుడి బయట భక్తులకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న కుక్క

గుడి బయట భక్తులకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న కుక్క

Dog: ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కుక్కలతో ఏదో ఒక సందర్భంలో మరపురాని జ్ఞాపకం ఉంటుంది. అంత మంచి జంతువులు కాబట్టే ఇళ్లలో పెంచుకోవడానికి ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. కానీ, మహారాష్ట్రలోని సిద్ధాటెక్ లో ఉన్న సిద్ధి వినాయక్ గుడి వద్ద కుక్క నేరుగా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తుంది. ఈ సీన్ మొత్తాన్ని రికార్డు చేసిన అరుణ్ లిమాడియా ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

వైరల్ వీడియో వెనుక కథేంటి
సిద్ధి వినాయక టెంపుల్ ఎంట్రన్స్ బయట ఓ కుక్క కూర్చొని గుడిలో నుంచి బయటకు వచ్చే వారికి చెయ్యి ఇస్తే చాలు. షేక్ హ్యాండ్ ఇవ్వడం దాని కాలితో తలపై ఆశీర్వాదం ఇవ్వడం చేస్తుంది. ఈ సీన్ మొత్తాన్ని వీడియోలో చూడొచ్చు.

గుడిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి తల వంచి దానికి నమస్కారం చేయడంతో ముందు కాలితో ఆశీర్వదించింది. ఆ తర్వాత అతను కుక్క నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లిపోయాడు.

దీనిపై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తూ వైరల్ అయింది. 1.3మిలియన్ మంది కంటే వీడియో చూడటంతో పాటు లక్షా పది వేల వ్యూస్ వచ్చాయి. కామెంట్లు మాత్రం వరదలా వచ్చిపడుతున్నాయి. కుక్కలు మనుషుల కంటే విలువైనవని, చాలా విలువైన ప్రేమ వాటి దగ్గర ఉంటుందంటూ పొగడ్తలు కురిపించేస్తున్నారు.