Election Results: గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి విజయఢంకా… హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 37 స్థానాల్లో గెలుపొందింది.

Election Results: గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి విజయఢంకా… హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు

Election Results

Election Results: గుజరాత్‌లో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆ రాష్ట్రంలో ఏడో సారి కాషాయ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన అక్కడ ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ప్రతి ఐదేళ్లకు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు వేర్వేరు పార్టీలకు అవకాశం ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లను ఆ పార్టీలు దాటాయి.

గుజరాత్ లో మొత్తం సీట్లు 182. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 37 స్థానాల్లో గెలుపొందింది. మరో మూడు స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటివరకు 23 స్థానాల్లో గెలుపొంది, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇతరులు మూడు సీట్లు గెలుచుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే, తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Gujarat Polls: గత ఎన్నికల్లో బీజేపీని గజగజలాడించిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు కనుమరుగైంది? ఆ నేత లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమా?