Viral Video: మెడికల్ షాపులో మాత్రలు కొంటున్న వేళ.. యువకుడికి గుండెపోటు.. మృతి

వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు, గుండెపోటుతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కొంత కాలంగా పెరిగిపోయింది. ఇటీవల పదే పదే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు మెడికల్ షాప్ వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

Viral Video: మెడికల్ షాపులో మాత్రలు కొంటున్న వేళ.. యువకుడికి గుండెపోటు.. మృతి

Viral Video: వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు, గుండెపోటుతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కొంత కాలంగా పెరిగిపోయింది. ఇటీవల పదే పదే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు మెడికల్ షాప్ వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

హరియాణాలోని ఫరిదాబాద్ లో ఓ మెడికల్ షాప్ కు వెళ్లి మాత్రలు కొనుక్కుంటున్నాడు ఓ యువకుడు. అతడు అడిగిన ఔషధాలను మెడికల్ షాపులోని వ్యక్తి తీసి ఇస్తున్నాడు. ఇంతలో ఆ యువకుడికి గుండె పోటు వచ్చింది. మొదట మెడికల్ షాప్ టేబుల్ పై చేతులు పెట్టి దానికి ఒరిగాడు. అనంతరం నొప్పి పెరగడంతో పట్టు తప్పి కింద పడిపోయాడు.

దీంతో మెడికల్ షాప్ లోని వ్యక్తి బాధితుడి వద్దకు వెళ్లి పరిశీలించాడు. అతడిని లేపేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. దీంతో పోలీసులకు ఈ మెడికల్ షాప్ యజమాని ఫోన్ చేసి సమాచారం అందించాడు. గుండెపోటుతో బాధితుడు మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు.

Joshimath Sinking : ద్వారకలానే.. చరిత్రలో కలిసిపోనున్న మరో చారిత్రక పట్టణం..! జోషిమఠ్‌లో భయం భయం