#BharatJodoYatra: రేపు భారత్ జోడో యాత్ర ముగింపు సభ.. పాల్గొననున్న 12 పార్టీల ముఖ్యనేతలు
దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. మొత్తం 21 పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించగా కొన్ని పార్టీల నేతలు హాజరు కావడం లేదు. వారిలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ కూడా ఉన్నాయి.

#BharatJodoYatra: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర రేపటితో ముగియనుంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేపు శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర ముగింపు సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ సభకు కాంగ్రెస్ నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు.
దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. మొత్తం 21 పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించగా కొన్ని పార్టీల నేతలు హాజరు కావడం లేదు. వారిలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ కూడా ఉన్నాయి.
సభకు హాజరయ్యే పార్టీల జాబితాలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ఎండీకే, శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తేజస్వీ యాదవ్ కు చెందిన ఆర్జేడీ, సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేనతో పాటు సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేఎంఎం ఉన్నాయి. ఆ పార్టీల ముఖ్యనేతలు రేపు శ్రీనగర్ చేరుకుని సభలో పాల్గొంటారు.
పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనే అవకాశం ఉండడంతో భద్రతను పెంచారు. కాగా, నిన్న భారత్ జోడో యాత్రలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. తాము భారత్ జోడో యాత్రను నిర్వహిస్తోంది 2024 ఎన్నికల కోసం కాదని, దేశాన్ని ఏకం చేయడానికేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది.