Ghulam Nabi Azad: గులాంనబీ ఆజాద్ మళ్ళీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని వార్తలు.. స్పందించిన ఆజాద్

తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తమ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ నాయకులను, మద్దతుదారులను నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాననే వార్త నిరాధారమైనదని స్పష్టం చేశారు.

Ghulam Nabi Azad: గులాంనబీ ఆజాద్ మళ్ళీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని వార్తలు.. స్పందించిన ఆజాద్

Ghulam Nabi Azad

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన గులాం నబీ ఆజాద్ మళ్ళీ అదే పార్టీలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆజాద్ స్పందిస్తూ అదంతా అసత్య ప్రచారమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం గులాం నబీ ఆజాద్ జమ్మూకశ్మీర్ లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాలుగు నెలలు అవుతోంది.

అయితే, ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారని, ఇందుకోసం ఆజాద్, కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని గులాంనబీ ఆజాద్ ను పలువురు కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారని కూడా ప్రచారం జరుగుతోంది. గులాం నబీ ఆజాద్ కు, కాంగ్రెస్ మధ్య ఉన్న దూరాన్ని తొలగించే పనిని కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలకు అప్పగించిందని వార్తలు వచ్చాయి.

వీటన్నింటిపై గులాం నబీ ఆజాద్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని చెప్పారు. దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు.

తమ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ నాయకులను, మద్దతుదారులను నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంపై ఎలాంటి దురాభిప్రాయం లేదని తెలిపారు. తన గురించి ప్రచారాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాననే వార్త నిరాధారమైనదని స్పష్టం చేశారు.

Chili Cultivation : మిరప సాగులో కలుపు యాజమాన్య పద్దతులు!