UP College: బుర్ఖా ధరించిన విద్యార్థినులను గేటు వద్దే అడ్డుకున్న కాలేజ్‌ సిబ్బంది

UP College: బుర్ఖా ధరించిన విద్యార్థినులను గేటు వద్దే అడ్డుకున్న కాలేజ్‌ సిబ్బంది

Hijab Row

UP College: బుర్ఖా ధరించిన కొందరు విద్యార్థినులను ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ హిందూ కాలేజ్‌ సిబ్బంది కళాశాల లోపలికి రాకుండా అడ్డుకున్నారు. కాలేజీ విద్యార్థులకు యూనిఫాం కోడ్ ఉన్నప్పటికీ కొందరు అమ్మాయిలు బుర్ఖా ధరించి వచ్చారని కళాశాల సిబ్బంది తెలిపారు. దీనిపై సదరు విద్యార్థినులు స్పందిస్తూ.. తాము బుర్ఖా ధరించి వచ్చినందుకు కాలేజ్ క్యాంపస్ లోకి రానివ్వలేదని, గేటు వద్దే బుర్ఖాను తొలంచాలని చెప్పారని అన్నారు.

ఈ ఘటనతో విద్యార్థులు, సమాజ్ వాదీ ఛత్రా సభ కార్యకర్తలు, కాలేజ్ ప్రొఫెసర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాలేజ్ వద్ద చోటుచేసుకున్న గొడవపై ప్రొఫెసర్ ఏపీ సింగ్ మాట్లాడుతూ… తమ కళాశాలలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నామని, ఎవరైనా దాన్ని తిరస్కరిస్తే క్యాంపస్ లోకి అనుమతించవద్దని నిబంధనలు ఉన్నాయని చెప్పారు.

ఈ ఘటన అనంతరం సమాజ్ వాదీ ఛత్రా సభ సభ్యులు కాలేజ్ అధికారులకు ఓ విజ్ఞాపన పత్రం అందించారు. బుర్ఖా వేసుకున్న వారిని తరగతి గదుల్లోకి అనుమతించాలని కోరారు. 2022, జనవరిలోనూ కర్ణాటకలో హిజాబ్ విషయంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హిజాబ్ వేసుకున్న విద్యార్థినులను కాలేజ్ లోకి అనుమతించకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.

Helicopter crash In Ukraine: యుక్రెయిన్‌ హెలికాప్టర్ ప్రమాదంలో రష్యా ప్రమేయం ఉందా? జెలెన్ స్కీ వాదన ఏమిటంటే ..