Security breach: భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ముర్ము కాళ్లు మొక్కేందుకు ఇంజనీర్ యత్నం.. సస్పెన్షన్

‘‘పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ (పీహెచ్ఈడీ) జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ జనవరి 4న రోహెత్ లో నిర్వహించిన స్కౌట్ గైడ్ జంబోరీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు యత్నించారు. రాజస్థాన్ పౌర సేవల నిబంధనల అధికారం కింద మేము ఆమెను సస్పెండ్ చేస్తున్నాము. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుంది’’ అని పీహెచ్ఈడీ చీఫ్ ఇంజనీర్ పేర్కొన్నారు.

Security breach: భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు ఓ ప్రభుత్వ ఇంజనీర్. దీంతో రాజస్థాన్ కు చెందిన ఆ ఇంజనీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు చెప్పారు.

‘‘పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ (పీహెచ్ఈడీ) జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ జనవరి 4న రోహెత్ లో నిర్వహించిన స్కౌట్ గైడ్ జంబోరీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు యత్నించారు. రాజస్థాన్ పౌర సేవల నిబంధనల అధికారం కింద మేము ఆమెను సస్పెండ్ చేస్తున్నాము. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుంది’’ అని పీహెచ్ఈడీ చీఫ్ ఇంజనీర్ పేర్కొన్నారు.

స్కౌట్ గైడ్ జంబోరీలో నీటి నిర్వహణ బాధ్యతలను ఇంజనీర్ సియోల్ కు అప్పగించారు. ఆమె ఆ పనులు చేస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్ముకు అధికారులు స్వాగతం పలుకుతున్న సమయంలో సియోల్ ముందుకు వచ్చి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కడానికి యత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్రపతి భద్రతా సిబ్బంది వెంటనే సియోల్ ను అడ్డుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులు సియోల్ ను నిబంధనల ప్రకారం ప్రశ్నించారు. సియోల్ చర్యను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది.

Pakistan: పాక్‌లోని పెషావర్‌లో పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి.. డీఎస్పీసహా ముగ్గురు మృతి

ట్రెండింగ్ వార్తలు