క్యాన్సర్, హెచ్ఐవీ, కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.2వేల 250పెన్షన్

క్యాన్సర్, హెచ్ఐవీ, కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.2వేల 250పెన్షన్

haryana government: క్యాన్సర్, హెచ్ఐవీ, కిడ్నీ సమస్యలు లాంటి వాటిని సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీంలోకి యాడ్ చేయాలని హర్యానా ప్రభుత్వం డిసైడ్ చేసింది. హర్యానాకు చెందిన సోషల్ జస్టిస్ అండ్ ఎంపర్‌మెంట్ మినిష్టర్.. ఓం ప్రకాశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. క్యాన్సర్, కిడ్నీ, హెచ్ఐవీ పేషెంట్లకు నెలకు రూ.2వేల 250ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘క్యాన్సర్, కిడ్నీ, హెచ్ఐవీ బాధితులు దాదాపు 25వేల మంది బెనిఫిషియరీలు ఉన్నారు. రాష్య వ్యాప్తంగా అన్ని జిల్లాల చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్టును బట్టే పరిగణిస్తారు. రిపోర్ట్ సబ్‌మిట్ చేసినంత త్వరగా.. పెన్షన్ స్కీం అమల్లోకి వస్తుంద’ని మంత్రి అధికారికంగా వెల్లడించారు.

గతేడాదే స్కీం అమలు చేయాల్సి ఉందని.. కొవిడ్ 19 కారణంగా కాస్త ఆలస్యమైందని చెప్పారు. అతి త్వరలోనే అమలు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28లక్షల బెనిఫిషియరీలకు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీం కింద నెలకు రూ.2వేల 250 అందజేస్తారు.