ఇందన ధరలు కేంద్రానికి ఆదాయం ఎలా తెస్తున్నాయో తెలుసా

ఇందన ధరలు కేంద్రానికి ఆదాయం ఎలా తెస్తున్నాయో తెలుసా

1

Fuel Rates Hike: ఇందన ధరలు పెరగడం వల్ల కేంద్రానికి లాభం ఉంటుందని తెలుసు. కానీ అదెంత? ఎలానో తెలుసా? అసలు కేంద్రానికి ప్రస్తుతం మెయిన్ ఆర్థిక వనరుగా ఇదే మారిపోయింది.

ఎల్పీజీ కేవలం మార్కెట్ ధరకే
LPG: వంట గ్యాస్ ధరను మరోసారి పెంచుతున్నట్లు అది రూ.25 వరకూ ఉండొచ్చని కేంద్రం ప్రకటించింది. అది సబ్సీడీ, నాన్ సబ్సీడీ కేటగిరీ యూజర్లకు వర్తిస్తుందని చెప్పింది. ఎల్పీజీ కేవలం దేశం మొత్తం మార్కెట్ ధరకే దొరుకుతుంది.

డిసెంబర్ నుంచి చూస్తే రూ.150వరకూ
ఈ ఏడాది బడ్జెట్ లో ఎల్పీజీ సబ్సిడీ కింద రూ.12వేల 480కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంటే 2019-2020 సంవత్సరంలో ఉన్న రూ.35వేల 605కోట్లుగా ఉన్న సబ్సిడీని రూ.12వేల 480కోట్లు తగ్గించి 2020-21నాటికి రూ.25వేల 520.79కోట్లకు కుదించారు. ఫిబ్రవరి 4న రూ.25పెరిగిన సిలిండర్ ధర, ఫిబ్రవరి 15న రూ.50పెరిగింది. డిసెంబర్ నుంచి పెరిగిన ధరలను చూస్తే మొత్తం రూ.150వరకూ పెరిగింది.


ఆల్రెడీ సబ్సిడీని ఎత్తేసి
కిరోసిన్: కిరోసిన్ మీద ఆల్రెడీ సబ్సిడీని ఎత్తేసింది కేంద్రం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో మార్కెట్ రేట్లకే అందిస్తున్నారు. బడ్జెట్ 2021-22 నాటికి కిరోసిన్ పై సబ్సిడీ ఉందనే విషయాన్ని కూడా గుర్తుండదు. రేషన్ కార్డ్ హోల్డర్లకు వంట కోసం ఇందనంగా కిరోసిన్ ఇస్తున్నారు.

West-Bengal-Fuel-Rate
ఆయిల్ కంపెనీలకు చెల్లించే సబ్సిడీని ఆపేయడంతో
పెట్రోల్ అండ్ డీజిల్: పెట్రోల్ ధరలు 2010లో, 2014లో డీజిల్ ధరలు డీ రెగ్యూలేట్ చేశారు. అవి మార్కెట్ ధరలను బట్టి ఉంటాయి కానీ, గవర్నమెంట్‌ను బట్టి కాదు. ఆయిల్ కంపెనీలకు చెల్లించే సబ్సిడీని ఆపేయడంతో కూడా జరగొచ్చు. జూన్ 2017నుంచి ఆయిల్ కంపెనీలు ఇందన ధరలను రివైజ్ చేసుకుంటూ వస్తున్నాయి. మూడేళ్ల నుంచి అలా జరుగుతూనే ఉంది.