హ్యూండాయ్ డీజిల్ ఇంజిన్ కార్లు ఇకపై రావ్!!

హ్యూండాయ్ డీజిల్ ఇంజిన్ కార్లు ఇకపై రావ్!!

Hyundai Car: దక్షిణకొరియా ఆటోమేకర్ హ్యూండాయ్ ఇకపై డీజిల్ ఇంజిన్ కార్లను విడుదల చేయడానికి నో చెప్పేసింది. నెక్స్ట్ జనరేషన్ డీజిల్ ఇంజిన్లను ఆపేయాలని ప్లాన్ చేసింది. ప్రస్తుత డీజిల్ ఇంజిన్ వెహికల్స్ లైఫ్ సైకిల్ అయిపోయేంత వరకూ వాడుకోవచ్చు. అవి డంపింగ్ కు వెళ్లేముందు హైబ్రిడ్ పెట్రోల్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్‌తో మరో 3-5ఏళ్ల వరకూ వాడుకోవచ్చు.

హ్యూండాయ్ 2025నాటికి ఫుల్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీని ప్రకారం.. హ్యూండాయ్ ఆటోమేకర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ షేర్‌ను 8నుంచి 10శాతం తమవైపుకు తిప్పుకోవాలని చూస్తుంది.

Euro 7 emission ప్రకారం.. 2025లో అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దీనిని బట్టి డీజిల్ ఇంజిన్ల కాలం ఇక చెల్లినట్లే. ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమేకర్ అయిన హ్యూండాయ్ యూరోప్ లో ప్రస్తుతం డీజిల్ కార్లను డెవలప్ చేయడం ఆపేసింది. ఒకవేళ ఇండియాలో వీటిని డెవలప్ చేయడం ఆపేస్తే.. 2025నాటికి డీజిల్ వెహికల్స్ కంటికి కనిపించవు.

ప్రస్తుతం హ్యూండాయ్.. కియా తమ కార్లలో దాదాపు డీజిల్ ఇంజిన్లే వాడుతున్నాయి. విదేశీ బ్రాండ్లు అయినటువంటి కియా, హ్యూండాయ్ ల మాట అటుంచితే.. ఇండియా మార్కెట్ లీడర్ డీజిల్ ఇంజిన్లకు పూర్తిగా నో చెప్పేసి పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ కార్లని రెడీ చేసే ఆలోచనలో ఉంది.

ప్రస్తుతం హ్యూండాయ్ Grand i10 NIOS, the Aura, the Verna, the Venue, the Creta, the Tucson వెహికల్స్ అన్నింటికీ డీజిల్ ఇంజిన్లు మాత్రమే వాడుతుంది. కియా కూడా Sonet, Seltos and Carnival వాహనాలకు డీజిల్ ఇంజిన్ వాడుతుంది. ఇది హ్యూండాయ్ ఒక్క నిర్ణయమే కాదు. వోల్క్‌స్వాగన్ కూడా స్టీరింగ్ పెట్రోల్ ఇంజిన్ వైపు తిప్పేసింది. లేదంటే ఎలక్ట్రిక్ కార్లు. అలా కాకుండా డీజిల్ ఇంజిన్ కు నో అంటోంది.