CBI Raids: 9510001000 నంబరుకు ప్రతి ఒక్కరు మిస్డ్ కాల్ ఇవ్వండి: సీఎం కేజ్రీవాల్ పిలుపు

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తోన్న నేపథ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను ఇటీవలే ప్రారంభించిన మిషన్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ గురించి ఆయన మరో ప్రకటన చేశారు. ‘ఈ మిషన్ లో చేరాలనుకుంటోన్న వారు 9510001000 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రపంచంలో భారత్ ను నంబర్ 1 దేశంగా, శక్తిమంతమైన దేశంగా చూడాలనుకుంటోన్న వారు మిస్డ్ కాల్ ఇవ్వండి’ అని చెప్పారు.

CBI Raids: 9510001000 నంబరుకు ప్రతి ఒక్కరు మిస్డ్ కాల్ ఇవ్వండి: సీఎం కేజ్రీవాల్ పిలుపు

CBI Raids

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తోన్న నేపథ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను ఇటీవలే ప్రారంభించిన మిషన్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ గురించి ఆయన మరో ప్రకటన చేశారు. ‘ఈ మిషన్ లో చేరాలనుకుంటోన్న వారు 9510001000 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రపంచంలో భారత్ ను నంబర్ 1 దేశంగా, శక్తిమంతమైన దేశంగా చూడాలనుకుంటోన్న వారు మిస్డ్ కాల్ ఇవ్వండి’ అని చెప్పారు.

”మనీశ్ సిసోడియా పేరు గతంలో న్యూయార్క్ టైమ్స్ లో మొదటి పేజీలో వచ్చింది. అంటే, ప్రపంచంలోనే ఆయన ఉత్తమ విద్యా శాఖ మంత్రి అని రుజువైంది. సీబీఐ దాడుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. సీబీఐ అధికారులను వారి పనులు వారు చేసుకోవచ్చు. మమ్మల్ని వేధించాలని వారికి పై నుంచి ఆదేశాలు వచ్చాయి. సీబీఐ దాడులు చేయడం మొదటిసారి కాదు. గత ఏడేళ్ళలో మనీశ్ సిసోడియాపై పలుసార్లు దాడులు చేసింది. ఆయనపై పలు నకిలీ కేసులు బనాయించారు. నాపై, సత్యేందర్ జైన్ పై, కైలాశ్ గహ్లోత్ పై కూడా దాడులు జరిగాయి. కానీ, మా వద్ద ఏమీ లభించలేదు’ అని కేజ్రావాల్ అన్నారు.

కాగా, భారత్‌ను మళ్ళీ గొప్పదేశంగా తీర్చిదిద్దడానికి దేశ పౌరులు ముందుకు రావాలని, దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడానికి పాఠశాలలు, ఆసుపత్రులను సమర్థంగా నడిపించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహిళలకు సమాన హక్కులు ఉండాలని కేజ్రీవాల్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అందుకోసమే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ ప్రారంభిస్తుందని చెప్పారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్