Tejashwi Yadav on Alliance: నితీశ్ కుమార్‌తో కూటమి ఏర్పాటు ఆకస్మికంగా జరిగింది: తేజస్వీ యాదవ్

బీజేపీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మిత్రత్వాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, తమ పార్టీ ఆర్జేడీతో కలవడం ఆకస్మికంగా జరిగిన పరిణామంగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అయితే, జేడీయూ, ఆర్జేడీ పార్టీల ఎమ్మెల్యేలు ఓ సారి కలిసి చర్చించారని తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపేలా ఆర్జేడీ ఎమ్మెల్యేలను ఒప్పించారని అన్నారు.

Tejashwi Yadav on Alliance: నితీశ్ కుమార్‌తో కూటమి ఏర్పాటు ఆకస్మికంగా జరిగింది: తేజస్వీ యాదవ్

Tejashwi Yadav on Alliance

Tejashwi Yadav on Alliance: బీజేపీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మిత్రత్వాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, తమ పార్టీ ఆర్జేడీతో కలవడం ఆకస్మికంగా జరిగిన పరిణామంగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అయితే, జేడీయూ, ఆర్జేడీ పార్టీల ఎమ్మెల్యేలు ఓ సారి కలిసి చర్చించారని తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపేలా ఆర్జేడీ ఎమ్మెల్యేలను ఒప్పించారని అన్నారు.

దేశ తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి నితీశ్ కుమార్ సమర్థుడేనా? అన్న ప్రశ్నకు తేజస్వీ యాదవ్ స్పందించారు. నితీశ్ కుమార్ కు పరిపాలనా అనుభవం ఉందని అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయినప్పుడు, మరి నితీశ్ కుమార్ ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని బిహార్ సీఎం నితీశ్ కుమార్ మంచిపని చేశారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని పంపి బెదిరిస్తుందన్న భయం తనకేమీ లేదని తేజస్వీ యాదవ్ చెప్పారు. ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖల అధికారులు తన ఇంటికి, కార్యాలయానికి రావాలని, వారికి ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడే ఉండాలని తాను ఆహ్వానిస్తున్నానని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఓ భాగంగా ఈడీ అధికారులు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేజీ ప్రజల ముఖంలో చిరునవ్వును దూరం చేస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. కాగా, బిహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్