ఎవరైనా హిందువు అయితే కచ్చితంగా దేశభక్తుడై తీరాలి: ఆర్ఎస్ఎస్

RSS-Chief-Mohan-Bhagwat
RSS Chief Mohan Bhagwat: ఎవరైనా హిందువు అయి ఉంటే వారు కచ్చితంగా దేశభక్తుడై తీరాలి. అది అతని క్యారెక్టర్, నేచర్ అవ్వాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ దేశభక్తి గురించి విశ్లేషిస్తూ ఈ వ్యాక్యలు చేశారు. ఓ ఈవెంట్ లో రచయిత జేకే బజాజ్, ఎండీ శ్రీనివాస్ రాసిన మేకింగ్ ఆఫ్ హిందూ పాట్రియట్: బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ గాంధీజీస్ హింద్ స్వరాజ్ బుక్ లాంచింగ్ కార్యక్రమంలో మాట్లాడారు.
బుక్ విడుదల చేస్తూ.. ‘ఎవరైనా గాంధీజీ అవ్వాలనుకుంటున్నారా అది కుదరని పని. ఎందుకంటే అలాంటి గ్రేట్ పర్సనాలిటీల్లాగా మనం ఉండలేం’ అని అన్నారు. బుక్ గురించి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ రీసెర్చ్ డ్యాక్యుమెంట్ లో ధర్మ, దేశభక్తి అనేవి వేర్వేరని అతని ఆధ్యాత్మికత నుంచి తెలుసుకోవచ్చని ఉదహరించారు.
‘గాంధీజీ దేశభక్తి అతను పాటించిన ధర్మం నుంచి వచ్చిందని చెప్పారు’ అని భగవత్ అంటున్నారు. ఇక్కడ ధర్మ అంటే మతం గురించి చెప్పినట్లు.
మీరెవరైనా హిందువు అయి ఉంటే కచ్చితంగా దేశభక్తుడై ఉండాలి. అది అతని బేసిక్ క్యారెక్టర్ గా మారిపోవాలి. ఎవరైనా దేశభక్తుడిగా మారొచ్చు. కానీ, ఒక హిందు ఎప్పటికీ దేశ విద్రోహి కాలేడు. ఈ విషయాన్ని స్పృహలో ఉంచుకుని దేశాన్ని ప్రేమించాలి. అంటే భూభాగాన్ని మాత్రమే కాదు. అంటే నదులు, కల్చర్, సంప్రదాయాలు అన్నీ వస్తాయి’ అని ఆయన అన్నారు.
‘హిందూయిజం అనేది ఐకమత్య భావననే నమ్ముతుంది. తేడా అనేది వేరు చేయాలని కాదు. గాంధీ చెప్పిన దాని ప్రకారం.. హిందూయిజం అనేది మతాలన్నింటికీ మతం లాంటిది’ అని అభిప్రాయపడ్డారు.