ఇండియాలో వ్యాక్సిన్ సెకండ్ షాట్‌ శనివారం నుంచే.. అంతా రెడీ

ఇండియాలో వ్యాక్సిన్ సెకండ్ షాట్‌ శనివారం నుంచే.. అంతా రెడీ

India: ఇండియాలో కరోనావ్యాక్సిన్ సెకండ్ షాట్ కు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. 28రోజుల క్రితం మొదలుపెట్టిన డ్రైవ్.. రెండో విడతను శనివారం నుంచి నిర్వహించనున్నారు. అర్హులైన వారికి నేరుగా ఎస్సెమ్మెస్ లతో పాటు డైరక్ట్ ఫోన్ కాల్స్ తో అలర్ట్ చేస్తున్నారు. ప్రపంచానికి కొత్త ఛాలెంజ్ గా మారిన కరోనావ్యాక్సిన్ గురించి భారీగా ప్రచారం చేపట్టారు.

మొదటి డోసేజ్ లో భాగంగా.. జనవరి 16న 2లక్షల 2వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ‘కరోనావ్యాక్సిన్ రెండో డోస్ ను మొదటి డోసేజ్ వేసిన తర్వాత నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ తో వేస్తార’ని డా. వీకే పాల్ (నీతి అయోగ్ సభ్యులు) అంటున్నారు. మొదటి సారి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండోసారి వేస్తున్న ఫిబ్రవరి 13న సెకండ్ డోస్ వేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు.

కొన్ని పరిస్థితుల రీత్యా సెకండ్ డోసేజ్ వేయడానికి కుదరకపోతే రాష్ట్రాలు తమకు వీలైన మరోతేదీని ఫిక్స్ చేసుకోవచ్చు. స్లాట్ మిస్ అవకుండా ఉండటానికి షెడ్యూల్ డేట్ తప్పకుండా మరొకటి చూసుకోవాలని పాల్ అంటున్నారు. ఈ మేరకు వారికి ఫోన్ కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజెస్ రూపంలో అప్‍‌డేట్స్ వస్తుంటాయని వివరించారు.

సింగిల్ బెనిఫిషియరీ కూడా మిస్ అవకూడదని నిర్వహకులు ఈ జాగ్రత్త పడుతున్నారు. ఫస్ట్ షాట్ తీసుకున్న 4 నుంచి 8వారాల గ్యాప్ లో రెండో డోస్ తీసుకోవచ్చు. వీలైనంత త్వరగా వేసుకోవడం బెటర్. అని నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబర్ డా. ఎన్కే ఆరోరా అంటున్నాడు.