గబ్బాలో దెబ్బ: తొలి సారి దమ్ముచూపిన టీమిండియా.. 33ఏళ్ల తర్వాత ఆసీస్‌కు పరాభవం

గబ్బాలో దెబ్బ: తొలి సారి దమ్ముచూపిన టీమిండియా.. 33ఏళ్ల తర్వాత ఆసీస్‌కు పరాభవం

Gabba: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ లో తిరుగులేని కంగారూలను 33ఏళ్ల తర్వాత ఓడించింది రహానెసేన. నాలుగో టెస్టులో చాకచక్యంగా ఆడి మూడు వికెట్ల తేడాతో గెలవడమే కాకుండా టెస్టు సిరీస్ ను గెలిచింది. ఇదే వేదికగా 1988లో ఓడిపోయిన ఆసీస్.. ఇన్నేళ్లుగా ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తుంది.

అలాంటి గడ్డపై ఐదో రోజు 328పరుగుల లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్(91), రిషబ్ పంత్ (89 నాటౌట్), పూజారా(56)ల వీరోచిత ఇన్నింగ్స్ తో గెలిచేశారు. ఓవర్ నైట్ స్కోరు 4తో మ్యాచ్ మొదలుపెట్టిన ఇండియా.. పూజారా-గిల్(114 పరుగులు), పూజారా-పంత్(61 పరుగులు), పంత్-సుందర్ (53పరుగులు) భాగస్వామ్యంతో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.

గబ్బాలో అత్యధిక పరుగుల టెస్టు క్రికెట్ లక్ష్య చేధన మూడోది.. బ్రిస్బేన్ లో టీమిండియాకు తొలి విజయం. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 406పరుగులు, ఇంగ్లాండ్ తో 387పరుగుల లక్ష్య చేధన గతంలో జరిగాయి.

ఈ విజయంతో ఇండియా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను రెండోసారి సొంతం చేసుకుంది. 2018-19, 2020-21లో సిరీస్ మనకే దక్కింది.

విరాట్ కోహ్లీ గైర్హాజరీతో టీమిండియాకు బౌలింగ్ ప్రధాన ఛాయీస్ గా మారింది. గ్రేటెస్ట్ ప్లేయర్లను తప్పించడానికి చక్కటి వ్యూహాలు రచించింది. 2018-19లో కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసిన టీమిండియాకు రెండో విజయానికి కాస్త టైం పట్టింది.