Covid cases: దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదు

Covid cases: దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదు

CORONA

Covid cases: దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 2,227 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. యాక్టివ్ కేసుల సంఖ్య మొన్నటి కంటే నిన్న 30 తగ్గిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లుగా ఉందని (4,46,80,936) పేర్కొంది.

కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 5,30,726గా ఉందని చెప్పింది. డైలీ పాజిటివిటీ రేటు 0.10 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, వారాంతపు పాజిటివీటీ రేటు కూడా 0.10 శాతంగా ఉందని వివరించింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నట్లు చెప్పింది. జాతీయ కొవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటిరవకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,47,983గా ఉన్నట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.16 కోట్ల (2,20,16,78,543) డోసుల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. నిన్న 52,577 డోసుల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. నిన్న దేశంలో 1,74,467 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

Fertilizers In Banana : అరటిలో ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన తప్పనిసరి!