Covid-19: దేశంలో కొత్తగా 17,135 క‌రోనా కేసులు

మొన్న న‌మోదైన క‌రోనా కేసుల‌లో పోల్చితే గ‌త 24 గంటల్లో దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్న దేశంలో 13,734 కరోనా కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 17,135 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర‌, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,37,057గా ఉంది.

Covid-19: దేశంలో కొత్తగా 17,135 క‌రోనా కేసులు

COVID-19

Covid-19: మొన్న న‌మోదైన క‌రోనా కేసుల‌లో పోల్చితే గ‌త 24 గంటల్లో దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్న దేశంలో 13,734 కరోనా కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 17,135 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర‌, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,37,057గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 19,823 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 4,34,03,610కి చేరింది.

ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.49 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా, వారాంత‌పు పాజిటివిటీ రేటు 4.67 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 204.84 కోట్ల క‌రోనా డోసులు వినియోగించారు. వాటిలో సెకండ్ డోసులు 93.36 కోట్లు, బూస్ట‌ర్ డోసులు 9.47 కోట్లుగా ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో 23,49,651 క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 87.63 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. గ‌త 24 గంట‌ల్లో 4,64,919 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు