Covid cases: దేశంలో కొత్తగా 556 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 556 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,68,523గా ఉందని చెప్పింది. నిన్నటి కంటే యాక్టివ్ కేసులో 252 తగ్గి, 6,782గా ఉన్నాయని పేర్కొంది. నిన్న కరోనా వల్ల దేశంలో మొత్తం 17 మంది మృతి చెందారని, వారిలో 15 మంది కేరళకు చెందిన వారే ఉన్నారని వివరించింది.

Covid cases: దేశంలో కొత్తగా 556 కరోనా కేసులు నమోదు

Corona cases

Covid cases: దేశంలో కొత్తగా 556 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,68,523గా ఉందని చెప్పింది. నిన్నటి కంటే యాక్టివ్ కేసులో 252 తగ్గి, 6,782గా ఉన్నాయని పేర్కొంది. నిన్న కరోనా వల్ల దేశంలో మొత్తం 17 మంది మృతి చెందారని, వారిలో 15 మంది కేరళకు చెందిన వారే ఉన్నారని వివరించింది.

ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 5,30,570కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,31,171కు చేరిందని తెలిపింది. కొవిడ్ రికవరీ రేటు 98.79 శాతం ఉందని తెలిపింది.

దేశంలో కరోనాకు ఇప్పటివరకు 219.85 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పింది. నిన్న 88,394 డోసులు వేశామని వివరించింది. నిన్న దేశంలో మొత్తం 2,59,451 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..