COVID-19 UPDATE: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 830 మందికి కొవిడ్

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 1,000 కంటే తక్కువగా నమోదైంది. కొత్తగా 830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 21,607 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయని వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 830 మందికి కొవిడ్

COVID-19 UPDATE: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 1,000 కంటే తక్కువగా నమోదైంది. కొత్తగా 830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 21,607 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది.

దేశంలో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయని వివరించింది. రికవరీ రేటు 98.77 శాతంగా ఉన్నట్లు చెప్పింది. నిన్న కరోనా నుంచి 1,771 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,40,95,180గా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.67 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు దేశంలో 219.57 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు పేర్కొంది. వాటిలో 95.01 కోట్ల రెండో డోసులు, 22.04 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 96,633 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 90.03 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. నిన్న 1,23,104 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..