Covid-19 infections: దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో మాత్రం రోజువారీ కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న దేశంలో 134 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

Covid-19 infections: దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు

CORONA

Covid-19 infections: దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో మాత్రం రోజువారీ కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న దేశంలో 134 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,78,956) చేరిందని వివరించింది. కరోనా వల్ల దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 5,30,707కు పెరిగిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా ఉంది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.13 శాతంగా నమోదయిందని పేర్కొంది.

మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,45,667గా ఉందని చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

ఇప్పటివరకు దేశంలో వాడిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 220.11 కోట్లుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ లోని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

Terrifying Drone Video: బీచ్‌లో ఉన్న అమ్మాయి వద్దకు దూసుకువచ్చిన భారీ షార్క్ చేప