ఇండియాలో 4రాజధానులు ఉండాల్సిందే: మమతా బెనర్జీ

ఇండియాలో 4రాజధానులు ఉండాల్సిందే: మమతా బెనర్జీ

Mamata-Banerjee

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియాలో నాలుగు రాజధానులు ఉండాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే రాజధాని ఉండటానికి బదులు ఇలా చేయాలని సూచిస్తున్నారు. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా మాట్లాడిన ఆమె.. కేంద్రంపై, ప్రధాని మోడీలను టార్గెట్ చేశారు.

‘ఇండియా కచ్చితంగా నాలుగు రాజధానులు ఉండాలని నమ్ముతున్నా. బ్రిటీష్ వారు దేశం మొత్తాన్ని కోల్‌కతా నుంచే పరిపాలించారు. అలాంటప్పుడు దేశంలో ఒకే రాజధాని ఎందుకుండాలి’ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

నేతాజీ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన బహిరంగ సభ ర్యాలీలో పాల్గొన్నారు. మోడీ గవర్నమెంట్ రద్దు చేసిన ప్లానింగ్ కమిషన్‌ను కేంద్రం మరో సారి రీ ఇంట్రడ్యూస్ చేయాలని. నీతి అయోగ్, ప్లానింగ్ కమిషన్ అనేవి కలిసి పనిచేయాలి. కేంద్రం తప్పనిసరిగా పున ప్రవేశపెట్టాలి.

నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీని రెడీ చేసినప్పుడు.. గుజరాత్, బెంగాల్, తమిళనాడుల నుంచి ప్రతి ఒక్కరినీ తీసుకున్నారు. అప్పట్లో ‘విభజించు – పాలించు’ అనే విధానానికి వ్యతిరేకంగా పోరాడారు. మేం ఆజాద్ హిందూ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తాం. అదెలా జరుగుతుందో కూడా చూపిస్తాం. వాళ్లు విగ్రహాలు కట్టడానికి, కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ కట్టడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మమతా విమర్శలు గుప్పించారు.