తొందరపడి ముందే కూసిందా..: డీఆర్ఎస్ లు మొత్తం వాడేసిన కోహ్లీసేన

తొందరపడి ముందే కూసిందా..: డీఆర్ఎస్ లు మొత్తం వాడేసిన కోహ్లీసేన

india-vs-england-virat-kohli

India vs England: టీమిండియాకు శనివారం కూడా కలిసిరాలేదు. జోయ్ రూట్.. విజృంభణ ఇంగ్లీష్ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ వేదికగా డబుల్ సెంచరీ నమోదు చేసేశాడు. 154వ ఓవర్ కు గానీ వికెట్ దక్కించుకోలేకపోయాడు నదీమ్. ఇదే ఊపులో భారీ స్కోరు బాదేయాలని ఇంగ్లాండ్ జట్టు వ్యూహరచనలో ఉంది.

ఒత్తిడి పెంచాలని ప్రయత్నించిన టీమిండియా.. అందుకు తగ్గట్లు ఫలితాలు రాబట్టలేకపోయింది. బట్లర్ అవుట్ అయ్యాడంటూ.. హడావుడి చేసిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ప్రదర్శన పండలేదు. అవుట్ అని మొత్తుకుంటున్నా అంపైర్ వేలెత్తి డిక్లేర్ చేయలేదు. బట్లర్ బ్యాట్ మీదుగా బంతి వెళ్తూ సౌండ్ క్లియర్‌గా వినిపించినా.. అప్పటికే ఆవేశపడి డీఆర్ఎస్ లు వాడేయడంతో అవకాశం కోల్పోయినట్లు అయింది.

రీప్లేలోనూ బట్లర్ బ్యాట్ ఎడ్జ్ ను తాకి వెళ్లినట్లుగా కనిపించి మరింత నిరుత్సాహపరిచింది. ఇదిలా ఉంటే, టెస్టు క్రికెట్ లో 84ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ 150కి మించిన స్కోరు నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా రూట్ ఘనత సాధించేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే ఈ రికార్డు సాధించగా రూట్ రెండోవారడు.

వందో టెస్టులో శతకం బాదిన తొమ్మిదో ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. 98, 99, 100వ టెస్టుల్లో శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గానూ సంచలనం సృష్టించాడు. దీనికి తోడు భారత్‌లో తానాడిన ఏడు టెస్టుల్లో ప్రతిదాంట్లోనూ హాస్‌సెంచరీకి తగ్గకుండా పరుగులు సాధించాడు.