Uzbekistan deaths: ఆ భారతీయ కంపెనీలో అన్ని రకాల ఔషధాల తయారీ నిలిపివేత

‘‘నోయిడాలోని మారియన్ బయోటెక్ సంస్థలో అన్ని ఔషధాల తయారీ కార్యకలాపాలను నిన్న రాత్రి నుంచి నిలిపివేశాం. ఆ సంస్థపై విచారణ కొనసాగుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ ట్వీట్ చేశారు. తనిఖీలు తర్వాత అందాల్సిన నివేదికల గురించి తాము ఎదురుచూస్తున్నామని మారియన్ బయోటెక్ సంస్థ అధికారులు అంటున్నారు.

Uzbekistan deaths: ఆ భారతీయ కంపెనీలో అన్ని రకాల ఔషధాల తయారీ నిలిపివేత

Uzbekistan deaths

Uzbekistan deaths: భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును వాడడం వల్ల ఉజ్బెకిస్థాన్‌ లో 19 మంది చిన్నారులు మరణించారన్న ఆరోపణలు రావడంతో ఆ మందును తయారు చేసిన సంస్థలో అన్ని రకాల ఔషధాల తయారీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డ్రగ్స్ నియంత్రణ సంస్థ ఆ సంస్థను తనిఖీ చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

‘‘నోయిడాలోని మారియన్ బయోటెక్ సంస్థలో అన్ని ఔషధాల తయారీ కార్యకలాపాలను నిన్న రాత్రి నుంచి నిలిపివేశాం. ఆ సంస్థపై విచారణ కొనసాగుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ ట్వీట్ చేశారు. తనిఖీలు తర్వాత అందాల్సిన నివేదికల గురించి తాము ఎదురుచూస్తున్నామని మారియన్ బయోటెక్ సంస్థ అధికారులు అంటున్నారు.

మారియన్ బయోటెక్ సంస్థ న్యాయవిభాగ అధికారి హసన్ హార్రిస్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘నివేదిక గురించి మేము ఎదురుచూస్తున్నాం. మా సంస్థలోని అన్ని ఔషధాల తయారీని నిలిపివేశాం’’ అని వివరించారు. కాగా, తమ దేశంలో 19 మంది చిన్నారులు చనిపోయారని, దానికి భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందే కారణమని ఉజ్బెకిస్థాన్‌ నిన్న చెప్పింది.

మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మాక్స్ సిరప్ ను చిన్నారులు వాడారని తెలిపింది. గాంబియాలో కొన్ని నెలల క్రితం భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును వాడడం వల్ల 70 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మరవకముందే ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌ లోనూ అటువంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.

WhatsApp Multiple Chats : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో మల్టీపుల్ చాట్లను ఒకేసారి ఎంచుకోవచ్చు..!