COVID-19 UPDATE: దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశంలో 2,529 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.74 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 3,553 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,40,43,436కు చేరిందని వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Corona

COVID-19 UPDATE: దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశంలో 2,529 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.74 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 3,553 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,40,43,436కు చేరిందని వివరించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.38 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 89.62 కోట్ల కరోనా పరీక్షలు చేశామని వివరించింది. నిన్న 1,22,057 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 218.84 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు పేర్కొంది. వాటిలో రెండో డోసు వ్యాక్సిన్లు 94.88 కోట్లు, బూస్టర్ డోసు వ్యాక్సిన్లు 21.47 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 79,366 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..