ఎలక్ట్రిక్ కారుగా మారిపోయిన ఇండియా తొలి మారుతీ సుజుకీ డిజైర్

ఎలక్ట్రిక్ కారుగా మారిపోయిన ఇండియా తొలి మారుతీ సుజుకీ డిజైర్

Maruti Suzuki: ఇండియన్ మార్కెట్‌లోకి మారుతీ సుజుకీ మాత్రమే ఇంకా ఎలక్ట్రిక్ కారు తీసుకురాలేదు. కొత్తగా ఓ వ్యక్తి మారుతీ సుజుకీని ఎలక్ట్రిక్ వెహికల్ గా ప్రయోగం చేసేశాడు. ఈ డిజైర్ వాహనం 2020 ఫిబ్రవరి మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మారిపోయింది. చాలా రెగ్యూలర్ స్టాండర్డ్ వెహికల్స్ ను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చిన నార్త్ వే మోటార్‌స్పోర్ట్ సంస్థనే ఈ పని కూడా చేసింది.

టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ మోడల్ ఇంకా సర్టిఫికేట్ మాత్రమే పొందాల్సి ఉంది. ఇంకా దీనిని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేందుకు అంతా ఇంట్లోనే పనిచేశారట. ఇప్పుడు దానిలో 15కిలోవాట్స్ మోటర్ వాడుతుండగా.. అవసరమైతే 35కిలోవాట్స్ వరకూ పెంచుకోవచ్చు. ఆ మోటార్ సాయంతో 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుండగా.. చక్రాల వద్దకు వచ్చేసరికి 842ఎన్ఎమ్ ఉంటుంది.

ఇందులో 13KWh సామర్థ్యమున్న బ్యాటరీ ఉండగా.. ఆ బ్యాటరీ ప్యాక్ ను 15KWh వరకూ అప్ గ్రేడ్ చేయొచ్చు. డిజైర్ ఈవీ ప్రస్తుతం ఈ ప్యాక్ ఉపయోగిస్తుంది. అదనంగా మిగిలి ఉన్న స్పేస్ లో మరో బ్యాటరీ యాడ్ చేసుకుని దానిని 18KWh కెపాసిటీ వరకూ పెంచుకోవచ్చు.

ముందుగా 947కేజీల బరువు ఉన్న స్టాక్ డిజైర్ ఎలక్ట్రిక్ కారుగా మారిన తర్వాత 3కేజీలు పెరిగి 950కేజీలు మాత్రమే అయింది. పైగా అదేసమయంలో అన్ని ఫంక్షన్లకు పనిచేస్తున్నాయి. క్లస్టర్, పెడల్, పవర్ స్టీరింగ్, అన్ని కంట్రోల్స్, ఏబీఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ అన్ని ఫీచర్లు పనిచేసి స్టాక్ వర్షన్ లాగా రెడీ అవుతోంది.

దీని టాప్ స్పీడ్ గంటకు 160కిలోమీటర్లు ఉండగా.. 34శాతం వాలుగా ఉన్న ఎత్తుకు ఎక్కగలదు. 3టన్నుల బరువు వేసినప్పటికీ కదులుతుంది. సున్నా నుంచి 100శాతం ఛార్జింగ్ అవ్వాలంటే.. 8గంటల సమయం పడుతుంది. వేగంగా ఛార్జ్ చేసే పద్ధతి కోసం వాళ్లు ట్రై చేస్తున్నారు.