Updated On - 2:18 pm, Sat, 27 February 21
Bumrah Released: ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా ఫేసర్ బుమ్రా దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘పర్సనల్ రీజన్స్ తో రాబోయే నాలుగో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ నాలుగో టెస్టు సెలక్షన్ కు అందుబాటులో ఉండడని వెల్లడించింది. అతని స్థానంలో వేరొకరిని తీసుకునే ఉద్దేశ్యం లేదని తెలిపింది.
అహ్మదాబాద్ వేదికగా మార్చి 4న టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీం నాలుగో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో ఆడిన తుది 11మంది జట్టులో బుమ్రా ఒకరు. అహ్మదాబాద్ లో ఆడి భారత్ 10వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టుకు కూడా బుమ్రా విశ్రాంతిలోనే ఉన్నాడు.
అప్పటి నుంచి పిచ్ స్పిన్నర్లకు మాత్రమే అనుకూలంగా ఉండటంతో రెస్ట్ లోనే ఉన్నాడు. మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ 20కు గానూ 18వికెట్లు తీశారు. బుమ్రా టెస్టు కెరీర్ జనవరి 2018లో మొదలైంది. మొత్తం 19టెస్టులు ఆడిన బుమ్రా ఖాతాలో 83వికెట్లు ఉన్నాయి.
ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో బుమ్రా గుజరాత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్. సిరాజ్, ఉమేష్ యాదవ్
India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!
Corona Second Wave : షాకింగ్.. దేశంలో రోజుకు 3లక్షల కేసులు, మే చివరి వరకూ తీవ్రత
Foreign Made Vaccines : వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
కరోనాపై పోరాటంలో ‘Sputnik V’.. వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలుసుకోండి
Vaccine Shortage : భారత్ ను వేధిస్తోన్న టీకాల కొరత
Corona Second wave : వణుకు పుట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్.. ఒక్క రోజులోనే లక్షా 50 వేలకు పైగా కేసులు