ఇన్నింగ్స్ నిలబెట్టిన పూజారా-పంత్‌లు.. 321 పరుగుల వెనుకంజలో టీమిండియా

ఇన్నింగ్స్ నిలబెట్టిన పూజారా-పంత్‌లు.. 321 పరుగుల వెనుకంజలో టీమిండియా

IndVsEng: చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ ఇరగదీసిన మైదానం వేదికగా ఆడిన ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆర్చర్ ​బౌలింగ్​లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్‌ రోహిత్​(6) పరుగులకే కీపర్​ బట్లర్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 19 పరుగులకే తొలి వికెట్ ​చేజార్చుకున్న భారత్​ ఆ తర్వాత శుభమన్​ గిల్​(29) కూడా ఆర్చర్​ బౌలింగ్‌లోనే అండర్సన్​ చేతికి చిక్కాడు. అలా 44 పరుగులకే భారత్​ రెండో వికెట్​ కూడా కోల్పోయింది. లంచ్ విరామానికి 14ఓవర్లకు టీమిండియా స్కోరు 59/2గా నమోదైంది.

రెండో సెషన్​లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 11 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైయ్యాడు. డామ్​ బెస్​ వేసిన 25వ ఓవర్​నాలుగో బంతి విరాట్​ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి షార్ట్​లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఓలీ పోప్​ చేతుల్లో పడటంతో అవుట్ అయ్యాడు. భారత్​ 71 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

అప్పుడే క్రీజులోకి వచ్చిన రహానె కేవలం ఒక్క పరుగు చేసి తిరిగి వెళ్లిపోయాడు. ఫలితంగా 73 పరుగులకే నాలుగో వికెట్‌ను చేజార్చుకుని కష్టాల్లోకి కూరుకుపోయింది. అనంతరం చతేశ్వర్​ పుజారా, పంత్​ దూకుడుగా ఆడుతూ టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టీ విరామానికి స్కోరు 154/4 వరకూ చేర్చగలిగారు.

మూడో సెషన్​లో పుజారా, పంత్ ​ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. టీ20ని తలపించేలా దూకుడును ప్రదర్శించారు. 50.4ఓవర్​లో 192 పరుగులు వద్ద బెస్‌ బౌలింగ్​లో ఔట్ ​అయ్యాడు పంత్​. అప్పటికి స్కోరు 225. మూడో రోజు ఆటముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసిన టీమిండియా 321 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో అశ్విన్​(8), వాషింగ్టన్​ సుందర్​(33) నిలిచారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో డొమినిక్​ బెస్​(4), ఆర్చర్​(2) వికెట్లు తీశారు. అంతకుముందు ఇంగ్లాండ్​ ఆడిన ఇన్నింగ్స్​లో 578 పరుగులకు ఆలౌట్​ అయింది.