Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ
‘‘మన జీవితంలో చోటుచేసుకునే ప్రతి పరిణామాన్ని అభినందించాలని మనకు తగిలేగాయాలు నేర్పిస్తుంటాయి. నా కెరీర్ లో ఎన్నో గాయాలు తగిలాయి. అవి మనల్ని మరింత ప్రభావితం చేస్తుంటాయి. ఎన్ని సార్లు గాయపడ్డానన్న విషయాన్ని పట్టించుకోను.. గాయాల నుంచి నేను ఎన్నో నేర్చుకుంటున్నాను.. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తున్నాను’’ అని షమీ పేర్కొన్నాడు.

Bangladesh vs India
Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ. భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే మ్యాచుల సిరీస్ కి షమీ దూరమైన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సెషన్ లో తడి భుజానికి గాయం కావడంతో బెంగళూరులోని ఎన్సీఏలో బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటున్నాడని బీసీసీఐ కూడా ప్రకటన చేసింది.
షమీ స్థానంలో ఉమ్రాన్ ను స్క్వాడ్ లోకి తీసుకుంటూ ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. తనకు గాయం కావడం పట్ల షమీ స్పందిస్తూ… ‘‘మన జీవితంలో చోటుచేసుకునే ప్రతి పరిణామాన్ని అభినందించాలని మనకు తగిలేగాయాలు నేర్పిస్తుంటాయి.
31 Famous Brands: మనం రోజూ వాడే ఈ 31 ఫేమస్ బ్రాండ్ల పూర్తి పేర్లు మీకు తెలుసా?
నా కెరీర్ లో ఎన్నో గాయాలు తగిలాయి. అవి మనల్ని మరింత ప్రభావితం చేస్తుంటాయి. ఎన్ని సార్లు గాయపడ్డానన్న విషయాన్ని పట్టించుకోను.. గాయాల నుంచి నేను ఎన్నో నేర్చుకుంటున్నాను.. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తున్నాను’’ అని షమీ పేర్కొన్నాడు. కాగా, రేపు ఉదయం 11.30 గంటలకు షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే ప్రారంభం కానుంది.
Injury, in general, teaches you to appreciate every moment. I’ve had my share of injuries throughout my career. It’s humbling. It gives you perspective. No matter how many times I’ve been hurt, I’ve learned from that injury and come back even more stronger ?????????? pic.twitter.com/EsDLZd30Y7
— Mohammad Shami (@MdShami11) December 3, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..