ఐపీఎల్ 2021 వేలానికి స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు సైతం వేలానికి..

ఐపీఎల్ 2021 వేలానికి స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు సైతం వేలానికి..

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL )‌ 2021వ సీజన్ కు సంబంధి ఏర్పాట్లు మొదలుపెట్టేసింది బీసీసీఐ. ఈ మేర ఫ్రాంఛైజీలు IPL 2021 వేలంలోకి ప్లేయర్లను విడుదల చేయాలంటూ ఆర్డర్ ఇచ్చింది. వేలానికి వదిలేసిన ప్లేయర్లలో స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. 2018 IPL ‌కు ముందు స్మిత్‌ (రూ.12.5 కోట్లు) ఒక్కడినే అట్టిపెట్టుకున్న రాజస్థాన్‌ ఈ సారి హ్యాండ్ ఇచ్చింది. రెండేళ్ల సస్పెన్షన్‌ అనంతరం జట్టులోకి వచ్చినా కెప్టెన్ గా మళ్లీ అవకాశమిచ్చిన రాజస్థాన్ బ్యాట్ తో సరైన ప్రదర్శన చేయలేదని స్మిత్ కు నో చెప్పేసింది. ఇప్పుడు ఆ స్థానంలో యువ సంచలనం సంజు శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

2020 IPL ‌లో రాజస్థాన్‌ టాప్‌ స్కోరర్‌. 14 మ్యాచ్‌ల్లో 158 స్ట్రైక్‌ రేట్‌తో 375 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంగక్కర రాజస్థాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఫ్రాంఛైజీలు వదిలేయడంతో మ్యాక్స్‌వెల్‌, ఫించ్‌, మోరిస్‌, జేసన్‌ రే, అలెక్స్‌ కేరీ కూడా వేలానికి రానున్నారు. IPL జట్లు తమ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి జనవరి 20 ఆఖరు తేదీ.

యూఏఈలో జరిగిన IPL లో పేలవ ప్రదర్శన చేసినా.. చెన్నై జట్టులో మరీ ఎక్కువ మార్పులేమీ చేయలేదు. బెంగళూరు అత్యధికంగా 10 మందిని విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరిగే అవకాశమున్న IPL వేలంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అత్యధిక సొమ్ముతో పాల్గొనేందుకు రెడీ అయింది.

రైనా చెన్నైతోనే..:

ఊహాగానాలకు తెరదించుతూ చెన్నై సూపర్‌కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాను 2021 IPL సీజన్‌కు అట్టిపెట్టుకుంది. గత IPL కోసం యూఏఈ వెళ్లిన రైనా… పర్సనల్ రీజన్స్ తో వెనక్కు వచ్చేశాడు. వెళ్తే నష్టం లేదని మాట్లాడిన టీం మేనేజ్మెంట్ మళ్లీ తీసుకుందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. యూఏఈలో పేలవ ప్రదర్శన చేసిన కేదార్‌ జాదవ్‌తో పాటు సీనియర్‌ స్పిన్నర్లు హర్భజన్‌ సింగ్‌, పీయూష్‌ చావ్లాలనూ వదులుకుంది.

మలింగ బైబై

ముంబై ఇండియన్స్‌ ఆరంభం నుంచి ఆ జట్టులో అంతర్భాగంగా ఉన్న మలింగ.. పదునైన యార్కర్లను IPL ‌లో మనమిక చూడలేం. ఫ్రాంఛైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ‘మలింగ 12 ఏళ్లుగా ముంబై ఇండియన్స్‌లో అంతర్భాగంగా ఉన్నాడు. మరో అయిదేళ్లపాటు బౌలింగ్‌ దళంలో ఉండాలని కోరుకుంటున్నాం. అతని నిర్ణయాన్ని గౌరవిస్తాం’ అని ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్‌ అంబానీ అన్నాడు.

ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడిన మలింగ 170 వికెట్లు పడగొట్టాడు. నాలుగు సార్లు టైటిల్‌ గెలిచిన ముంబై టీంలో ఒకడిగా ఉన్నాడు. IPL చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అతడే. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది యూఏఈలో జరిగిన IPL సీజన్‌లో తప్పుకున్నాడు.

మ్యాక్స్‌వెల్‌ వేలానికి..: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను వదిలేసుకుంది. 2020 IPL లో యూఏఈలో జరిగిన టోర్నీలో 13 మ్యాచ్‌ల్లో 15 సగటుతో కేవలం 108 పరుగులు మాత్రమే చేసి టోర్నీ ఆసాంతం ఒక్క సిక్సూ కూడా నమోదుచేయలేకపోయాడు. పంజాబ్‌ అంతకుముందు రూ.10.75 కోట్లకు మ్యాక్స్‌వెల్‌ను కొనుక్కుంది.

వేలానికి రెడీగా ఉన్నవారు:

ముంబై ఇండియన్స్‌: కౌల్టర్‌నైల్‌, మెక్లెనగన్‌, రూథర్డ్‌ఫోర్డ్‌, ప్యాటిన్సన్‌, దిగ్విజయ్‌, ప్రిన్స్‌ బల్వంత్‌, మలింగ (రిటైర్డ్‌)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: సిద్ధార్థ్‌, నిఖిల్‌ నాయక్‌, సిద్దేశ్‌ లాడ్‌, క్రిస్‌ గ్రీన్‌, బాంటన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: కీమో పాల్‌, సందీప్‌ లచిమానె, అలెక్స్‌ క్యారీ, మోహిత్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, జాసన్‌ రే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: సంజయ్‌ యాదవ్‌, సందీప్‌ భవనక, బిల్లీ స్టాన్‌లేక్‌, ఫాబియాన్‌ అలన్‌, పృథ్వీరాజ్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: మ్యాక్స్‌వెల్‌, కాట్రెల్‌, కృష్ణప్ప గౌతమ్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, జిమ్మీ నీషమ్‌, విల్జోయెన్‌, కరుణ్‌.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: క్రిస్‌ మోరిస్‌, ఆరోన్‌ ఫించ్‌, మొయిన్‌ అలీ, ఉదాన, శివమ్‌ దూబె, ఉమేశ్‌ యాదవ్‌, పవన్‌ నేగి, గుర్‌కీరత్‌.

రాజస్థాన్‌ రాయల్స్‌: స్టీవెన్‌ స్మిత్‌, అంకిత్‌ రాజ్‌పుత్, ఒషేన్‌ థామస్‌, వరుణ్‌ ఆరోన్‌, టామ్‌ కరన్‌, అనిరుద్ధ జోషి, ఆకాశ్‌ సింగ్‌, శశాంక్‌ సింగ్‌.

చెన్నై సూపర్‌కింగ్స్‌: కేదార్‌ జాదవ్‌, షేన్‌ వాట్సన్‌ (రిటైర్డ్‌), పీయూష్‌ చావ్లా, మురళీ విజయ్‌, మోను కుమార్‌, హర్భజన్‌.